క్వీన్ మొదలైంది!

ఎట్టకేలకు బాలీవుడ్ క్వీన్ సినిమా రీమేక్ మొదలైంది. ఇప్పటివరకు ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ సినిమాను తాజాగా సెట్స్ పైకి తీసుకు వెళ్లారు. అదేంటి ఈ ప్రాజెక్ట్ నుండి తమన్నా తప్పుకుంది కదా..?మరి ఆమె స్థానంలోకి ఎవరిని తీసుకున్నారని ఆలోచిస్తున్నారా..? ఇంకా ఆమె స్థానంలోకి ఎవరిని ఫైనల్ చేయలేదు. అయినా ఈ సినిమా మొదలైన మాట వాస్తవమే.. అయితే అది కన్నడ రీమేక్.

ఈ సినిమా కోసం నిర్మాత త్యాగరాజన్ ఒక్కో భాష నుండి ఒక్కో హీరోయిన్ ను తీసుకున్నారు. కన్నడ వెర్షన్ కోసం పారుల్ యాదవ్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక కన్నడ వెర్షన్ దర్శకత్వం బాధ్యతలు రమేష్ అరవింద్ నిర్వహించబోతున్నారు. కన్నడ రీమేక్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి కావడంతో ముందుగా సినిమాను మొదలు పెట్టేశారు. అలానే తెలుగు, తమిళ, మలయాళ బాషల్లో కూడా ఈ సినిమాను రూపొందించనున్నారు.