అలాంటి వారితో పని చేయాలి: రామ్

ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఫాదర్ సెంటిమెంట్ తో ఉంటూ.. ఆడియన్స్ కు సందేశం ఇచ్చే
విధంగా సినిమా ఉంటుంది అంటూ రామ్ తన ‘హైపర్’ సినిమా గురించి ముచ్చటించారు
సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సంధర్భంగా.. హీరో రామ్ తో ఇంటర్వ్యూ..
హీరో క్యారెక్టరైజేషన్ హైపర్..
నేను.. శైలజ సినిమా అందరికీ నచ్చింది. కానీ నా నుండి డాన్స్, ఫైట్స్ ఆశించే ప్రేక్షకులు ఇంకా
ఏదో ఆశిస్తారు. అలాంటి వారికి హైపర్ ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్
హైపర్ గా ఉంటుంది. అలాంటి వాడు ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.. అందుకే క్యాప్షన్ గా అదే పెట్టాం.
ఫాదర్ సెంటిమెంట్..
ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఫాదర్ సెంటిమెంట్ తో ఉంటూ.. ఆడియన్స్ కు సందేశం ఇచ్చే
విధంగా సినిమా ఉంటుంది. కానీ ఆ మెసేజ్ చెప్పడానికి నా వయసు సరిపోదు. అందుకే సత్యరాజ్
వంటి నటుడిని తండ్రి పాత్రలో తీసుకున్నాం. కథ విన్నప్పుడు కూడా ఆ పాయింట్ నాకు బాగా
నచ్చింది.
సత్యరాజ్ కామెడీ చేస్తారు..
ఇప్పటివరకు సత్యరాజ్ గారు తెలుగులో సీరియస్ గా ఉండే పాత్రల్లోనే కనిపించారు. కానీ ఈ సినిమాలో
ఆయన కామెడీ యాంగల్ ను చూపించాం.
ఈ సినిమా హిట్ అయితే గౌరవం వస్తుంది..
కందిరీగ సమయంలోనే శ్రీనివాస్ చాలా మెచ్యూర్డ్ గా ఉండేవాడు. ఇప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్స్
ఇంకా పెరిగాయి. అయినా కందిరీగ, హైపర్ రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. కొన్ని సినిమాలు హిట్ అయితే
పేరొస్తుంది. ఈ సినిమా హిట్ అయితే గౌరవం వస్తుంది.
టెన్షన్ పడను..
టెన్షన్ పడాలనుకుంటే ప్రతిదానికి పడాలి. హిట్ వచ్చింది.. తరువాత సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని
ప్రెషర్ లో ఉండొచ్చు.. అలానే ఫ్లాప్ వచ్చింది.. నెక్స్ట్ ఎలా అయినా.. హిట్ కొట్టాలనే టెన్షన్ పడొచ్చు.
నా వరకు నేను దేనికి టెన్షన్ పడను.
అదే నాకు ఎక్కువ తృప్తినిస్తుంది..
నేను.. శైలజ సినిమా తరువాత నాకు చాలా కథలు ఆఫర్స్ వచ్చాయి. నటుడిగా నా పరిణితిని
రోజురోజుకి పెంచుకోవాలి. రామ్ ను ఇలా కూడా చూపించొచ్చు అని కొత్తగా ఆలోచించే వారితో పని
చేయాలానుకుంటాను. అందుకే డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ తో పని చేస్తుంటాను.. నాలో తెలియని
యాంగల్ ను ప్రొజెక్ట్ చేస్తే అదే నాకు ఎక్కువ తృప్తినిస్తుంది.
రాశిఖన్నా యాప్ట్..
ఈ సినిమాలో హీరోయిన్ కామెడీ చేయాలి. సుప్రీం సినిమా చూసిన తరువాత రాశి అయితే ఈ కథకు
యాప్ట్ అనిపించింది. అందుకే సెలెక్ట్ చేసుకున్నాం.
కమర్షియల్ సినిమాలు ప్రయోగాత్మకంగా..
నేను నటించిన ‘జగడం’,’ఎందుకంటే ప్రేమంట’ సినిమాలు ఆ జోనర్ లోకే వస్తాయి. అయితే కొన్ని
సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి.. కొన్ని ఫ్లాప్ అవుతాయి. వారికి నచ్చే విధంగా ఉండే
కమర్షియల్ ఎక్స్పెరిమెంట్ కథలు దొరికితే చేస్తాను.

CLICK HERE!! For the aha Latest Updates