అనుష్క భయపెడుతోంది!

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన అనుష్క మొదట్లో గ్లామర్ తరహా చిత్రాల్లో నటించింది.  గత కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ విమర్శకులచే ప్రశంసలు అందుకుంది. బాహబలి 2 చిత్రం తర్వాత  ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ ద‌ర్శ‌క‌త్వం, యువి క్రియేష‌న్స్ నిర్మించిన ‘భాగమతి’ చిత్రంలో నటిస్తుంది అనుష్క.  ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఈ రోజు సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. ఓ పాడుబ‌డిన భ‌వంతిలోకి కాలివేలు చిట్లించిన ఓ పాదం అడుగుపెట్ట‌డం.. గోడ‌కి త‌న చేతిని సుత్తితో అటాచ్ చేసేలా కొట్ట‌డం.. వంటి దృశ్యాలు చూస్తే ‘భాగ‌మ‌తి’ స‌మ్‌థింగ్ స్పెష‌ల్ అనేలానే ఉంది. ఆస‌క్తి రేకెత్తించే ఈ టీజ‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు పెరుగుతున్నాయి.  ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.