HomeTelugu Trendingనేను విశ్వ నటుడిగా ఉన్నాను: ప్రకాశ్‌ రాజు

నేను విశ్వ నటుడిగా ఉన్నాను: ప్రకాశ్‌ రాజు

 

Untitled 1

ఈ నెల 10వ తేదీన ‘మా’ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు గారిని హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి తన ప్యానల్‌ సంపూర్ణ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే చిత్ర నిర్మాణాలలో స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పించాలని, అందుకు ప్రకాశ్ రాజ్ తరపు నుండి పూర్తి సహకారం కావాలని వారు కోరారు.

ఈ సందర్భంగా ప్రకాష్ రాజు ఏపీ మా ప్రతినిధులతో మాట్లాడుతూ.. నేను విశ్వ నటుడిగా ఉన్నాను. కనుక ఏ రాష్ట్రానికో, భాషకో పరిమితం చేయవద్దు. మా ఎన్నికలకు గాను సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి కార్మికుడి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండే విధంగా భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తున్నాము. అన్ని రాష్ట్రాల్లోని కళాకారుల పరిస్థితి ఈ విధంగానే ఉంది కావున మీ ప్రాంతంలో మీరు మీ సంఘాన్ని పటిష్టం చేసుకోండి. భవిష్యత్తులో నా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందజేయలగలనని హామీ ఇస్తున్నాను.

ఎన్నికల అనంతరం విశాఖపట్నం వస్తాము. అలాగే కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వంతో కూడా మాట్లాడతాను. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కళాకారుల స్థానం మారదు. మనం కళాకారులం.. కళాకారులుగానే ఉందాం, జీవిద్దాం. మనకు తెలిసింది నటన ఒక్కటే. మన సంక్షేమం కోసం మనం కలిసి పని చేద్దాం.. అని అన్నారు.

అనంతరం ఏపీ మా అధ్యక్షులు ఎం. కృష్ణ కిషోర్, కార్యదర్శి వై అప్పారావ్, వ్యవస్థాపక అధ్యక్షలు ఏ. ఎం.ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిలు సిహెచ్.రమేష్ యాదవ్, పూతి వెంకటరెడ్డి, జీ ఎస్ కళ్యాణ్.. ప్రకాశ్ రాజుగారిని శాలువ, పుష్ప గుచ్చంతో సత్కరించి మెమొంటో(జ్ఞాపిక)ను అందజేశారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!