HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండ 'ఫైటర్‌'లో 'మైక్ టైసన్ !

విజయ్‌ దేవరకొండ ‘ఫైటర్‌’లో ‘మైక్ టైసన్ !

1 7
టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో నిరాశ పరిచాడు. అయితే ఇప్పుడు ’ఫైటర్‘ సినిమాతో హిట్టు కొట్టేందుకు సిద్ధమౌతున్నాడు ఈ హీరో. అంతేకాదు ఈ సినిమాతో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీగా ‘ఫైటర్‌’ను తెరక్కెకిస్తున్నాడు. పూరి, చార్మితో కలిసి ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ యువ నటి అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇందులో విజయ్ బాక్సర్‌‌గా కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే, అమెరికా దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషింబోతున్నట్లు తెలుస్తుంది. విలన్ పాత్రలో టైసన్ నటిస్తాడని, అతనితో విజయ్ ఫైటింగ్ చేస్తాడని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu