HomeTelugu Big Storiesపోసాని ఇంటిపై రాళ్లదాడి

పోసాని ఇంటిపై రాళ్లదాడి

Attack on posani house

టాలీవుడ్‌ నటుడు, దర్శకనిర్మాత, రచయిత.. పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు గుర్తుతెలియని వ్యక్తులు. హైదరాబాద్‌ అమీర్‌పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ నివాసం ఉంటున్నారు పోసాని. అయితే, అర్ధరాత్రి ఆయన నివాసం దగ్గరకు వచ్చిన కొందరు దుండగులు.. పోసాని ఇంటిపై రాళ్లువిసిరారు. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయిన రాళ్ల దాడికి పూనుకున్నారు. ఊహించన ఘటనతో వాచ్‌మన్‌ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురైయ్యారు. అయితే, ఘటనా జరిగిన సమయంలో పోసానిగానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ అక్కడ లేనట్టుగా తెలుస్తుంది.

గత ఎనిమిది నెలలుగా మరోచోట ఉంటున్నారు పోసాని కుటుంబ సభ్యులు.. ఇక, ఈ ఘటనపై సంజీవరెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాచ్ మెన్.. రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.. పోసాని ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరించే పనిలో పడిపోయారు.. కాగా, గత మూడు రోజులుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, పోసాని కృష్ణ మురళి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోసాని ఇంటిపై దాడి జరగడం చర్చగా మారింది. దుండగులు పోసాని ఇంట్లోనే ఉన్నాడని భావించి బూతులు తిడుతూ రాళ్లు విసిరారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!