మహేష్-బాలయ్య మల్టీస్టారర్!

ఈ మద్య టాప్ హీరోలు సోలోగా నటించే సినిమాలు పెద్దగా విజయాలు సాధించకపోవడంతో ఎవరికి వారు మల్టీ స్టారర్ ను ప్లాన్ చేస్తున్నారు.  ఒక వైపున ఎన్టీఆర్ – చరణ్ మల్టీస్టారర్ కి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటే, మరో వైపున బాలకృష్ణ – మహేశ్ బాబు మల్టీస్టారర్ కి రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ మద్య బోయపాటి ఈ ఇద్దరు హీరోలను కలిసి కథ వినిపించాడట.

ఇద్దరికీ బాగా నచ్చితేనే స్క్రిప్ట్ మీద కూర్చుంటానని బోయపాటి చెప్పడంతో, ఇటీవలే ఈ హీరోలు సూత్ర ప్రాయంగా తమ అంగీకారాన్ని తెలియజేసినట్టు సమాచారం.  ఇక పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన తరువాత కలిసి డిస్కస్ చేద్దామని బోయపాటితో అన్నారట. ఈ ప్రాజెక్ట్ గనుక ఫైనల్ అయితే ఇక టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కడం ఖాయమని తెలుస్తోంది!