బడా నిర్మాతలతో శర్వానంద్!

‘బాహుబలి’ వంటి భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు ఈ సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచేశారు. బాహుబలి2 దాదాపు 1600 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అయితే ఇలాంటి భారీ సినిమాను నిర్మించిన నిర్మాతల తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. రాజమౌళితోనే వీరి తదుపరి సినిమా ఉంటుందనే వార్తలు వినిపించినా.. వాటిలో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ నిర్మాతల నెక్స్ట్ సినిమా యంగ్ హీరోతో ఉంటుందని టాక్. ఆ యంగ్ హీరో మరెవరో కాదు శర్వానంద్. సెలెక్టివ్ స్క్రిప్ట్ లను ఎన్నుకుంటూ సక్సెస్ లను అందుకుంటున్న శర్వానంద్ తో సినిమా చేయడానికి శోభు, ప్రసాద్ లు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారని టాక్. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని చెబుతున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం. బాహుబలి సినిమా తరువాత ఆర్కా మీడియా నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో.. చూడాలి!