HomeTelugu Big Storiesఆ ల***లను నేనే చంపేసి జైలుకి వెళ్తా: పూనమ్‌ కౌర్‌

ఆ ల***లను నేనే చంపేసి జైలుకి వెళ్తా: పూనమ్‌ కౌర్‌

7 27టాలీవుడ్‌ నటి పూనమ్ కౌర్ శంషాబాద్‌కి చెందిన వెటర్నరీ వైద్యురాలి దారుణ హత్యపై మరోసారి స్పందించారు. నిందితులను తానే చంపి జైలుకి వెళతానంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఇలాంటి సమాజంలో ఉండటం కంటే అడవుల్లో నివసించడం మంచిదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వార్తలు అన్ని ఛానెల్స్‌లో కొన్ని రోజుల పాటు ట్రెండ్ అవుతుంటాయి. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించినప్పుడు ఎవరితోనైనా లేచిపోయిందేమో అని అనడానికి ఆ పోలీసు అధికారికి సిగ్గులేదా? ఓ మహిళ సాయం కోసం నడి రోడ్డుపై ఎదురుచూస్తుంటే ఆ నలుగురు ల** ఆమెకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి రేప్ చేసి నిప్పు పెట్టి చంపేశారు. కొన్ని గంటల పాటు తమ కూతురు ఎక్కడికిపోయిందో ఇంట్లో ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు తెలీదు. ఇంకెన్నాళ్లు పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకునేవరకు ఎదురుచూడాలి. ఆ జంతువులను చంపి జైలుకి వెళ్లాలని ఉంది. వారు జైలు శిక్ష అనుభవించడం కాదు. కావాలంటే నేనే వారిని చంపి జైలుకి వెళ్తా. దేశంలో జరుగుతున్న ఈ రేప్‌లను అరికట్టడానికి పరిష్కారం ఏంటి? ఇలాంటి సంఘటనలను రాజకీయం చేయకండి.

7a 5

నిందితుల్లో ఒకడైన కేవలం మహ్మద్ పాషానే టార్గెట్ చేయకండి. ఇక్కడ సమస్య మతం గురించి కాదు. మనం అడవుల్లో ఉంటున్నామా? అడవుల్లో అయినా కాస్త మేలేమో. కానీ మనుషుల బుర్రలు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ రేప్ సంఘటనలతో నేను విసిగిపోయాను. బాధితుల గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఆ నలుగురు ల***లను చంపేయాలని ఉంది. రేపిస్ట్‌లను చంపడం నేరమైతే నేను చేయడానికి సిద్ధమే. పరిష్కారాలను ఆలోచించండి. రాజకీయం చేయాలని చూడకండి’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు పూనమ్.

ఇదిలా ఉండగా.. ప్రముఖ నటి నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటలపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘నీలాంటి వారి వల్లే సామాన్య మహిళలపై రేపులు జరుగుతున్నాయి. నీ హాట్ శరీరాన్ని ఈ రకంగా చూపిస్తూ ఫొటోలు పోస్ట్ చేయకు’ అన్నాడు. దాంతో నిధికి ఒళ్లు మండింది. ‘ఇలాంటి దరిద్రమైన ఆలోచనా విధానం కలిగి ఉన్న వ్యక్తిని చూసి షాకింగ్‌గా ఉంది. నరేష్.. దయచేసి మీ ఇంటి అడ్రెస్ పంపు. ‘పింక్’ అనే సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా సీడీ నీకు పంపుతాను. ఆ సినిమా నువ్వు చూడటం చాలా అవసరం’ అని తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu