HomeTelugu Newsబ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయబోతున్న బాలయ్య

బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయబోతున్న బాలయ్య

8 24

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులోబాలకృష్ణ కొత్త లుక్‌లో యంగ్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ డిసెంబర్‌లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ దసరాకు ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాకు ‘రూలర్’ లేదా ‘క్రాంతి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణను బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. 2019 బాలకృష్ణకు కలిసి రాకున్నా తాను నటించిన కొత్త సినిమాను కూడా ఇదే ఏడాది విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. మరి బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడని ఆశిద్దాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!