లేడీ డైరెక్టర్ తో సూర్య!

మొదటి నుండి కూడా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ.. ముందుగు సాగిపోతున్నాడు సూర్య. ఈ క్రమంలో ఆయన దర్శకుడు విఘ్నేశ్ సివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘తానా సెరిందా కూట్టం’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.

తమిళంలో ‘ఇరుదు సుట్రు’ అనే సినిమాను తెరకెక్కించిన సుధా కొంగర ఆ సినిమాను తెలుగులో ‘గురు’ అనే పేరుతో రీమేక్ కూడా చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల ఆమె సూర్యను కలిసి కథ వినిపించడం జరిగిందని తెలుస్తోంది. కంటెంట్ నచ్చడంతో సూర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తను చేస్తోన్న ప్రాజెక్ట్ పూర్తి కాగానే సుధా కొంగర సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.