చంద్రబాబు కట్టించిన హైటెక్‌ సిటీ మూసేసే దమ్ముందా?

హైదరాబాద్‌లోని వివేకానందనగర్‌లో ప్రజాకూటమి అభ్యర్థి భవ్య ఆనంద్‌ ప్రసాద్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ పోరాడిందని ఆ పార్టీ అన్నారు. రాజకీయ చైతన్యం తెచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ‘పార్టీ జెండా.. ఎగరాలి తెలంగాణ నిండా’ అంటూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. తెలంగాణలో గడీల పాలనను తమ పార్టీనే అంతం చేసిందన్నారు.

‘తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. ఉపాధి, ఉద్యోగావకాశాలు లేవు. అమరవీరుల బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. అలాంటి అమరవీరుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించింది. తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర ఉంది. కేసీఆర్‌ ఎన్నోకబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు కట్టించిన హైటెక్‌ సిటీ మూసేసే దమ్ముందా? ఫ్లైఓవర్లు మాయం చేసే గట్స్‌ ఉన్నాయా? శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును మూసేస్తారా?’ అని బాలకృష్ణ ప్రశ్నించారు.

చంద్రబాబు కట్టిన కట్టడాల్లో మీటింగ్‌లు పెట్టుకుంటూ చంద్రబాబునే విస్మరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌కు దీటుగా సైబరదాబాద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు. టీడీపీలో గెలిచి టీఆర్‌ఎస్‌కు వలసపోయిన నమ్మకద్రోహుల భరతం పట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీకు గుణపాఠం చెప్పందుకే ప్రజాకూటమి ఏర్పాటు చేశామని, ప్రజా కూటమి అభ్యర్థి ఆనంద్‌ప్రసాద్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించా