HomeTelugu Trendingబాలకృష్ణ భారీ విరాళం.. చిరు ట్వీట్‌

బాలకృష్ణ భారీ విరాళం.. చిరు ట్వీట్‌

6 2
టాలీవుడ్‌ స్టార్‌ హీరో నందమూరి బాలకృష్ణ కరోనా మహమ్మారిపై పోరాటానికి.. కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టాయి. కరోనా కట్టడి కోసం పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు గత కొన్నిరోజుల నుంచి సినీ తారలు తమవంతు ఆర్థికసాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.1.25 కోట్లు విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. అందులో రూ.50లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, మరో రూ.50 లక్షలు ఆంధ్రప్రదేశ్‌ సీఎం సహాయనిధికి అందించనున్నారు. తెలుగు సినీ కార్మికుల సహాయార్థం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీసీ(కరోనా క్రైసిస్‌ ఛారిటీ)కి రూ.25 లక్షలు ప్రకటించారు. ఈ మేరకు రూ.25లక్షల చెక్కును ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు సి.కల్యాణ్‌కు అందించారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై తగిన జాగ్రత్తలు పాటించి కరోనాను అరికట్టాలని బాలయ్య సూచించారు.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి, సినీ కార్మికుల ఛారిటీకి విరాళం అందించిన బాలయ్యకు చిరంజీవి ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ”ప్రతి కష్ట సమయంలోనూ ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడు తోడుంటారు” అని ట్వీట్‌ చేశారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!