ఓ అరుదైన ఫొటోతో తండ్రి శుభాకాంక్షలు చెప్పిన నారా బ్రాహ్మణి


నేడు నందమూరి బాలకృష్ణ 60 వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన కూతురు, నారా బ్రాహ్మణి మాత్రం ట్విట్టర్ లో ఓ అరుదైన ఫోటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది.

బ్రాహ్మణి చిన్న తనంలో తన తాతయ్య ఎన్టీఆర్ తో కలిసి తీయించుకున్న ఫోటో అది. నారా బ్రాహ్మణి, ఎన్టీఆర్ తో పాటుగా ఆ ఫొటోలో నారా లోకేష్ కూడా ఉన్నారు. తన ఫోటో ఆల్బమ్ లో మరిచిపోలేని ఫోటో అని చెప్పి బ్రాహ్మణి ట్విట్టర్ లో పేర్కొన్నది. బాలకృష్ణకు శుభాకాంక్షలు చెప్తూ, ఈ ఫోటోను షేర్ చేసింది బ్రాహ్మణి. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

CLICK HERE!! For the aha Latest Updates