HomeTelugu Trendingబాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి అప్‌డేట్

బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి అప్‌డేట్

Bhagavant kesari update

నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న పవర్ ఫుల్ చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ తన కామెడీ పంథాను మార్చుకొని డిఫరెంట్‌గా తీస్తున్న మూవీ ఇది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌. యువ నటి శ్రీలీల కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

బాలకృష్ణ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమాకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ రాబోతుంది. ‘గీ ముసురు సలిలో మంట లాంటి ముచ్చట’ అంటూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇవాళ 2 గంటల 30 నిమిషాలకు ఈ అప్ డేట్ వస్తోందంటూ పోస్టర్ వచ్చింది. కొన్నిరోజులుగా వర్షం కారణంగా తెలుగు రాష్ట్రాలలో చల్లటి వాతావరణం నెలకొంది.

మరి, ‘భగవంత్ కేసరి’ మూవీ నుంచి వచ్చే అప్‌డేట్ ఏమిటో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!