
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే, ఈరోజు టిడిఎల్ఫీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బాలకృష్ణ హాజరయ్యారు. వైట్ అండ్ వైట్ లో ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చారు ఆయన. చూస్తుంటే అసలు బాలయ్యనా కాదా అనే విధంగా ఉన్నారు.
గుండు గెటప్ లో కొత్తగా కనిపించారు. ఇటువంటి గెటప్ లో బాలకృష్ణ కనిపించడం ఇదే మొదటిసారి. ప్యూర్ వైట్ డ్రెస్ లో తెల్లని గడ్డంలో చూడటానికి బాలయ్య శివాజీ సినిమాలో గుండుబాస్ రజినీకాంత్ ను తలపించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
#NBK 's Latest 🦁#NBK106 Boyapati Mass Loading 🔥💥 pic.twitter.com/Ntj3Ef6n3w
— Balayya Trends™ (@NBKTrends) January 19, 2020













