సింహానికే బాలయ్య ఓటు!

టాలీవుడ్ లో సెంటిమెంట్లకు కొదవ ఉండదు. అందులోనూ హీరో బాలయ్యకు అలాంటి పట్టింపులు చాలా ఎక్కువ. రీసెంట్ గా ఆయన నటించిన ‘పైసా వసూల్’ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సెంటిమెంట్ రీత్యా తనకు హిట్స్ ఇచ్చిన నయనతారను హీరోయిన్ గా తీసుకున్నారు.ఇప్పుడు తనకు కలిసొచ్చిన సింహా అనే పదాన్ని టైటిల్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. మొదట నుండి ఈ సినిమాకు ‘రెడ్డిగారు’,’జయ సింహా’ అనే టైటిల్స్ ను ఎన్నుకోవాలని అనుకున్నారు.

రీసెంట్ గా ‘కర్ణ’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు ‘జై సింహా’ అనే టైటిల్ ను ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఈ టైటిల్ ను సూచించినట్లు సమాచారం. మరి ఈ సెంటిమెంట్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి!