ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి మాతృవియోగం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కచేరీ కార్యక్రమాల నిమిత్తం లండన్‌కు వెళ్లిన బాలసుబ్రహ్మణ్యం తల్లి మరణవార్త తెలియగానే వెంటనే భారత్‌కు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం కల్లా ఆయన స్వస్థలానికి చేరుకుంటారు. మంగళవారం శకుంతలమ్మ స్వస్థలమైన నెల్లూరులో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.