రామ్‌ చరణ్‌కు బండ్ల గణేష్‌ రిక్వెస్ట్.!

బండ్ల గణేష్.. కమెడియన్‌ నుంచి పెద్ద హీరోలతో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు. పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో సినిమాలు తీశాడు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐతే అక్కడ వర్కవుట్ కాకపోవడంతో పొలిటికల్ ఫీల్డ్‌కి గుడ్‌బై చెప్పి మళ్లీ సినిమాలనే నమ్ముకున్నారు గణేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ద్వారా నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. యాక్టింగ్ చేస్తూనే మళ్లీ చిత్ర నిర్మాణంపై దృష్టిపెట్టాలని భావిస్తున్నారు. టాలీవుడ్‌లో చివరగా ‘పటాస్’ సినిమాను నిర్మించిన బండ్ల గణేష్.. ప్రస్తుతం మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

రామ్‌చరణ్ చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. 2014లో అక్టోబరు 1న ఆ చిత్రం విడులయింది. దాన్ని బండ్ల గణేషే నిర్మించారు. ఈ నేపథ్యంలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బండ్ల గణేష్. రామ్‌చరణ్‌తో మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీయాలని ఉందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘మరో ఛాన్స్ ఇవ్వండి లిటిట్ బాస్’.. అంటూ రామ్‌చరణ్‌ను ట్విటర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. ఆ అవకాశాన్ని త్వరగా ఇవ్వాలని కోరారు బండ్ల గణేష్. మరి ఆయన విజ్ఞప్తికి రామ్‌చరణ్ స్పందించి సినిమాను నిర్మించే అవకాశాన్ని ఇస్తారో లేదో చూడాలి.

CLICK HERE!! For the aha Latest Updates