HomeTelugu Trendingపవన్‌ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన బండ్ల గణేష్‌

పవన్‌ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన బండ్ల గణేష్‌

Bandla ganesh says sorry toవివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ప‌వ‌ర్ స్టార్’:ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’‌. ఈ చిత్రాన్ని ఈ రోజు ( జూలై 25) ఉదయం 11 గంటలకు ఆర్టీవీవరల్డ్‌ థియేటర్‌. కామ్‌లో విడుదల చేశాడు ఆర్జీవీ. విడుదలకు ముందే ‘గడ్డి తింటావా’ సాంగ్‌కు, ట్రైలర్‌కు భారీగా వ్యూస్‌ వచ్చాయి. కొత్త కొత్త పోస్టర్లతో పబ్లిసిటీ పీక్స్ కు చేర్చాడు వర్మ . పవన్ అభిమానులు చేసిన దాడిని కూడా తన పబ్లిసిటీకి వాడేశాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలోని సీన్లను వరుసగా పోస్ట్ చేస్తున్నాడు వర్మ. ఈ సినిమాలో పవన్, చిరంజీవి, త్రివిక్రమ్, బండ్ల గణేష్ లను పోలిన వ్యక్తులను చూపించాడు వర్మ.

ఇంతవరకు బాగానే ఉన్నా వర్మ తాజాగా విడుదల చేసిన ‘బ్రదర్స్ వీడియో’కు బండ్ల గణేష్ ట్విట్టర్‌లో రియాక్ట్ అవుతూ లైక్ కొట్టారు.ఇది పవర్‌ స్టార్‌ అభిమానుల్ని షాక్‌కి గురిచేసింది దీనితో బండ్ల గణేష్ తీరు పైన పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పవన్ అభిమాని అయితే ‘అదంతా కాదు బండ్ల అన్నా.. ఈ వీడియోను ఎందుకు లైక్ చేశావ్’ అని అడిగేశాడు. అయితే దీనిపైన స్పందించిన బండ్ల గణేష్ ”ఒట్టు.. ఏదో పొరపాటున జరిగిపోయింది. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయను. చేసిన తప్పుకు సారీ చెబుతున్నా”అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu