పొల్లాచ్చిలో బెల్లంకొండ శ్రీనివాస్!

“డిక్టేటర్” వంటి డీసెంట్ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీవాస్ యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్ లో ఒక షెడ్యూల్ మరియు హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర బృందం త్వరలో పొల్లాచ్చి వెళ్లనుంది. అక్కడ ఒక పల్లెటూరి సెట్ లో కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. “బలమైన కథ-కథనాలతో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.గా శ్రీవాస్-బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ మూవీ రూపొందుతోంది. ఇప్పటికీ రెండు షెడ్యూల్స్ అయ్యాయి. నెక్స్ట్ పొల్లాచ్చిలో 15 రోజుల భారీ షెడ్యూల్ జరగనుంది. అందుకోసం విండ్ టర్బైన్స్ తో కలిపి ఓ భారీ సెట్ ను రూపొందించాం. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా ప్లాన్ చేశాం. శ్రీవాస్ చాలా సమయం వెచ్చించి ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు, తెలుగులో ఇది చాలా డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. దాదాపు 40% చిత్రీకరణ పూర్తయ్యింది. ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్ర బృందమంతా కష్టపడి పనిచేస్తోంది” అన్నారు.