బిగ్‌బాస్‌: మెహబూబ్‌ ఎలిమినేట్‌!

బిగ్‌బాస్‌: మెహబూబ్‌ ఎలిమినేట్‌తెలుగు బిగ్‌బాస్‌-4 లో ఇప్ప‌టికే ప‌ది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యారు. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆసక్తికరంగా మారింది. నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్‌ ఎలిమినేట్‌ అయినట్టు చెప్పిన చివరకు సేవ్‌ చేశాడు నాగార్జున. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌ లేదు అకున్నారు. తాజాగా లీకువీరులు చెప్తున్న స‌మాచారం ప్ర‌కారం మెహ‌బూబ్‌ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడ‌ని వినికిడి. నిజానికి ఈయన ఎప్పుడో బ్యాగు స‌ర్దేయాల్సింది. కానీ అదృష్టం బాగుండి త‌ప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్ట‌కేల‌కు నామినేష‌న్‌లోకి వ‌చ్చి అడ్డంగా బుక్క‌య్యాడు. హౌస్‌లో ఉన్న స్ట్రాంగ్ ప్లేయ‌ర్ మెహ‌బూబ్ ‌ఒకడు. ఫిజిక‌ల్ టాస్కులో ఇర‌గ‌దీస్తాడు. అయితే అత‌డికి కండ‌బ‌లం ఉంది కానీ బుద్ధిబ‌లం కాస్త త‌క్కువ‌. దానికి తోడు టాస్కుల్లో త‌ప్పితే సాధార‌ణ స‌మ‌యాల్లో అత‌డికి ఎక్కువ‌గా స్క్రీన్ స్పేస్ కూడా ల‌భించ‌లేదు. సోహైల్‌తో స్నేహం త‌ప్ప ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ఏం చేయాల‌న్నదానిపై పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు.

CLICK HERE!! For the aha Latest Updates