‘సాహో’ కోసం బాలీవుడ్ భామ!

ప్రభాస్ తదుపరి సినిమా కోసం హీరోయిన్ వేట ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ ఎవరినీ కన్ఫర్మ్ చేసినట్లుగా లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న సినిమా కావడంతో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనే ఆలోచన ఉన్నారు చిత్రబృందం. ప్రస్తుతం సాహో చిత్రబృందం దీపికా పడుకొనే, లేదా కత్రినా కైఫ్ ను తీసుకుంటే బావుంటుందని అనుకుంటున్నారు.

అయితే దీపికా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ హాలీవుడ్ సినిమా కూడా ఉంది. ఈ నేపధ్యంలో ఆమె దక్షిణాది సినిమా చేస్తుందని చెప్పలేం. గతంలో కత్రినాకు తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. కాబట్టి మరోసారి సాహో సినిమాతో ఆమెను తెలుగుకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ దిశగా సంప్రదింపులు మొదలుపెట్టారు. కత్రినాతో పాటు మరో హీరోయిన్ కైరా అద్వానీను కూడా పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే నెల నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.