HomeTelugu Big Storiesతల్లి కాబోతున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. అందుకే అలా కవర్ చేసిందా?

తల్లి కాబోతున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. అందుకే అలా కవర్ చేసిందా?

Bollywood star heroine goin

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే తాజాగా బ్రిటీష్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ (బాఫ్టా) అవార్డుల కార్యక్రమానికి ప్రజెంటర్ గా హాజరైంది. అయితే అక్కడ షిమ్మరీ బీజ్ కలర్ చీరలో కనిపించి మురిపించింది. ఈ చీరలో కెమెరాకు పోజులిచ్చిన ఆమె.. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ లోనూ షేర్ చేసుకుంది. ఈక్రమంలో మరో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆమె ప్రెగ్నెంట్‌ అని అందుకే ఆమె తన పొట్టను దాచుకోవడానికి ఈ వేడుకలో చీరను కట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు ఆమెకు రెండో నెల అని అంటున్నారు. తనకు, రణ్‌వీర్ కు పిల్లలంటే చాలా ఇష్టమని, తాము కూడా ఓ ఫ్యామిలీని మొదలు పెట్టే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది దీపికా. అయితే అంతలోపే ఆమె తల్లి కాబోతోందన్న వార్తలు వస్తుండటం గమనార్హం.

ఇక వచ్చే వర్షా కాలంలోనే బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఈ వార్తలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రణ్‌వీర్ సింగ్, దీపికా 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీ కపుల్ రణ్‌బీర్, ఆలియా ఇప్పటికే పేరెంట్స్ గా ప్రమోషన్ పొందారు.

దీపికా పదుకొణె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్యే హృతిక్ రోషన్ తో కలిసి ఫైటర్ మూవీలో నటించింది. ప్రభాస్ తో కలిసి నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ మే 9న రిలీజ్ కానుంది. ఇది కాకుండా బ్రహ్మస్త్ర 2, సింగం అగైన్ సినిమాలూ చేస్తోంది.

మరోవైపు రణ్‌వీర్ తన నెక్ట్స్ మూవీస్ డాన్ 3, శక్తిమాన్, సింగం అగైన్ లతో బిజీగా ఉన్నాడు. ఇంత బిజీగా ఉన్న టైమ్‌ దీపికా ప్రెగ్నెంట్‌ వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఆమె నెక్ట్స్‌ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటీ అనే ప్రశ్నగా మారింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!