బన్నీ సినిమాలో బాలీవుడ్ నటుడు!

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఈ సినిమా తరువాత బన్నీ, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని ఎంపిక చేశారని చెబుతున్నారు. అలానే మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.

త్వరలోనే ఈ విషయాన్ని సంబంధించి ఓ అధికార ప్రకటన చేయనున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానిని రంగంలోకి దింపనున్నారు. సినిమాలో ఆయన పాత్ర నచ్చడంతో బొమన్ ఇరానీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన నటించిన ‘అత్తారింటికి దారేది’,’బెంగాల్ టైగర్’ వంటి సినిమాలు బొమన్ ఇరానికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు బన్నీ సినిమా అవకాశం రావడం, అలానే పవన్ సినిమా కోసం ఆయన సంప్రదించడం విశేషమనే చెప్పాలి,