ఆ సినిమా కోసం 45 కోట్లా..?

గతంలో కృష్ణంరాజు నటించిన ‘భక్త కన్నప్ప’ కథతో ఇప్పుడు సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తనికెళ్ళ భరణి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారనే మాటలు వినిపించాయి. మంచు వారి ఫ్యామిలీ కూడా ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత నుండి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్తలు వినిపించలేదు.

దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈ సినిమా గురించి విష్ణు ప్రస్తావించడంతో సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తాము 45 కోట్లలో నిర్మించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ మంచు విష్ణుని నమ్మి 45 కోట్లు ఇన్వెస్ట్ చేయడం మామూలు విషయం కాదు.

ఈ విషయం తనకు కూడా అర్ధమయ్యే ఉంటుంది. అందుకే డైరెక్ట్ గా తన మార్కెట్ వాల్యూ అంత లేదని కానీ స్క్రిప్ట్ మీద నమ్మకంతో అంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు తనికెళ్ళ భరణి కథ మాత్రమే అందిస్తున్నారని, దర్శకత్వ బాధ్యతలు మరో వ్యక్తికి అప్పగించనున్నట్లు తెలిపారు.