HomeTelugu Big Stories'జన్‌ ఆందోళన్‌'కు సెలబ్రెటీల సపోర్ట్‌..

‘జన్‌ ఆందోళన్‌’కు సెలబ్రెటీల సపోర్ట్‌..

Celebrities support to janప్రధాని మోడీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. దీని తన సోషల్‌ మీడియా అకౌంట్స్ల్‌ ద్వారా గురువారం ప్రారంభించారు. రానున్న చలికాలం అలాగే పండగలను దృష్టిలో పెట్టుకుని కరోనా ఉదృతి పెరగకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి మూడు అంశాల ఆవశ్యకతలను తెలియజేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ‘జన్‌ ఆందోళన్‌’ పేరిట ఈ కార్యక్రమాని చేపట్టింది. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ పై మూడింటిని పాటించాలని కోరుతున్నారు.

”కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రస్తుతం మనకు ఉన్న ఏకైక టీకా ఈ నియమాలను పాటించడమే. అందరం అది చేద్దాం. కరోనాకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ చేపట్టిన జన్‌ ఆందోళన్‌కు సపోర్ట్ చేస్తూ.. మనమందరం కలిసి కరోనాపై పోరాడదాం..”: నాగార్జున

” సమిష్టిగా అందరూ ఈ మహమ్మారిని ఎదుర్కొవడానికి ఉన్న ఒక్కటే మార్గం.. మాస్క్ ధరించడం, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వీలైనంతగా భౌతికదూరం పాటించడం అని గుర్తుపెట్టుకోండి..”: మహేష్‌

‘మనం అందరం కలిసి కరోనాపై పోరాటం కొనసాగిద్దాము.. ప్రధాని మోడీ చేపట్టిన జన్‌ ఆందోళన్‌కు నేను సపోర్ట్ చేస్తున్నాను.. మరి మీరు?” అని తెలుపుతూ సోనాక్షి సిన్హా తన ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా ఓ వీడియోను షేర్‌ చేశారు.

‘ఇండియాని సేఫ్‌గా ఉంచేందుకు నా దగ్గర ఉన్న మంత్రాలివే.. మాస్క్‌ను ధరించడం, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం పాటించడం. కరోనాకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ చేపట్టిన జన్‌ ఆందోళన్‌లో అందరం భాగమవుదాం..” అని తెలుపుతూ.. నాలాగే అందరూ కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భాగం అవుతారని కోరుకుంటున్నానని వెంకటేష్‌ పేర్కొన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!