‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై స్పందించిన చంద్రబాబు!

విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదని రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సైతం కలుగజేసుకుని ప్రజాస్వామ్యం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఒక వ్యక్తి రోడ్డు మీద ప్రె స్ మీట్ పెట్టనివ్వలేదని నన్ను ప్రశ్నిస్తాడు. అది ఎలక్షన్ కమీషన్ కు సంబందించినది. వెళ్లి వాళ్ళని అడగాలి. ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎందుకు. అదేమైనా కొత్త సినిమానా.. ఆల్రెడీ తెలంగాణలో విడుదలైన సినిమానే కదా అన్నారు.