ఏ టైమ్‌లో పుట్టావ్‌ అమ్మా.. సమంత పై ఛార్మీ ప్రశంసలు

ప్రముఖ నటి సమంతపై నటి ఛార్మి ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఓ బేబీ’ సినిమా మంచి టాక్‌ అందుకున్న నేపథ్యంలో ఛార్మి ట్వీట్‌ చేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని తన అభిప్రాయం తెలిపారు. ‘ఏ టైమ్‌లో పుట్టావమ్మా నువ్వు.. నీ శ్రమ, నీ నిర్ణయాలు, నీ జాతకానికి నమస్కారం.. నందిని రెడ్డి, మిగిలిన చిత్ర బృందం పట్ల చాలా సంతోషంగా ఉంది’ అంటూ సామ్‌ రాక్స్‌, ఓ బేబీ రాక్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. దీనికి సామ్‌ రిప్లై ఇచ్చారు. ‘నువ్వు ఎంతో క్యూటెస్ట్‌.. ధన్యవాదాలు ఛార్మి. నీకు నా ఆత్మీయ కౌగిలి, ముద్దుల్ని పంపుతున్నా’ అని ట్వీట్‌ చేశారు. దీనికి ‘ఛార్మీ’ నవ్వుతూ.. ఎమోజీలను పోస్ట్‌ చేశారు.

మరోపక్క ‘ఓ బేబీ’ అమెరికా ప్రీమియర్‌ షోలకు చక్కటి స్పందన లభించింది. అక్కడ ఈ సినిమా కేవలం ప్రీమియర్‌లో 1,45,135 డాలర్లు రాబట్టిందని విశ్లేషకులు తెలిపారు. ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు(ప్రీమియర్‌) సాధించిన ఆరో చిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లక్ష్మి, రావు రమేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌, నాగశౌర్య కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.