‘చెరసాల’ టీజర్‌ విడుదల చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి


ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? అనే కథాశంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమే “చెరసాల”. ఎస్ రాయ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్, రామ్ ప్రకాష్ గుణ్ణం, నిష్కల, శిల్పా దాస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ ప్రకాష్ గుణ్ణం దర్శకత్వం వహిస్తుండగా మద్దినేని సురేష్ సుధారాయ్‌లు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి “చెరసాల” టీజర్‌ను, ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ట్రైలర్‌ను విడుదల చేశారు. నిర్మాత ఆచంట గోపీనాథ్, బసి రెడ్డిలు “చెరసాల” చిత్రంలోని పాటలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత ఆచంట గోపీనాథ్, బసిరెడ్డి పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘కెమెరామెన్ దర్శకుడిగా మారి తీసిన ఈ చిత్రం మేకింగ్ చాలా బాగుంది. నిర్మాతలు దర్శకుడికి ఫ్రీడం ఇవ్వడం వలన సినిమా ఇంత బాగా వచ్చింది” అని అన్నారు. సినిమాల మీద మక్కువతో ఈ రంగానికి వచ్చానని, దాదాపు పదేళ్ళు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన అనుభవంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించానని దర్శకుడు రామ్ ప్రకాశ్ తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates