నాతో డబుల్ మీనింగ్‌లో మాట్లాడాడు: అమలాపాల్

మీ టూ ఉద్యమం ద్వారా నటీమణులు బయటికొచ్చి తమపై జరిగిన వేధింపులను బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్, రచయిత లీనా మణిమేకలై దర్శకుడు సుశీ గణేశన్ తనను వేధింపులకు గురిచేశాడని ఆరోపించగా పాపులర్ తమిళ హీరోయిన్ అమలపాల్ ఆమెను సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

‘తిరుట్టు పాయలై 2’ సినిమా షూటింగ్ సమయంలో సుశీ గణేశన్ తనతో ప్రవర్తించిన తీరు తనను చాలా ఇబ్బందిపెట్టిందని చెప్పుకొచ్చింది. సుశీ గణేశన్ తనతో డబుల్ మీనింగ్‌లో మాట్లాడేవాడని, అనుమతి లేకుండా తాకేందుకు ప్రయత్నించేవాడని, అది తనను ఎంతో ఇబ్బంది పెట్టిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం సుశీ గణేశన్ తనకు ఫోన్ చేశాడని, తాను వివరణ ఇచ్చే లోపే తిట్టడం ప్రారంభించాడని, అతని భార్య మంజరి కూడ అతనితో కలిసి నవ్వుతో తనను అవమానపరిచిందని ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది.