కొత్త లుక్ ట్రై చేస్తోన్న చిరు!

‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించుకొని ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరో మెగాస్టార్ ఇప్పుడు కొత్త సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా ఓ సినిమా అలానే అల్లు అరవింద్ నిర్మాతగా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ చిత్రాల కోసం చిరు కొత్త లుక్ ను ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 150వ సినిమా కోసం బరువు తగ్గిన చిరు ఇంకా స్లిమ్ అవ్వాలనుకుంటున్నాడట.

దీనికోసం స్పెషల్ గా ట్రైనర్ ను నియమించుకొని డైట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఆరు పదుల వయసు దాటినప్పటికీ అతడిలో కమిట్మెంట్, జోరు ఏమాత్రం తగ్గలేదు. ఖైదీలో డాన్సులతో కుమ్మేసిన చిరంజీవి ఇప్పుడు ఇంకా స్లిమ్ అయి సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయడం ఖాయమనిపిస్తోంది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ సినిమాను మార్చి నెలలో పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.