HomeTelugu Big Storiesడీఎస్పీ,ఉప్పెన హీరోయిన్‌కు మెగాస్టార్‌ కానుక

డీఎస్పీ,ఉప్పెన హీరోయిన్‌కు మెగాస్టార్‌ కానుక

Chiranjeevi special gift up

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ టాలీవుడ్‌లో హీరోగా నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’. తొలి సినిమాతోనే రికార్డులు సృష్టిస్తున్నాడు వైష్ణవ్‌ తేజ్‌. మెగా హీరోలను సైతం షాక్‌కు గురి చేస్తూ బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్లను కురిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించి అందరి చేత శభాష్‌ అనిపించుకుంది. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్‌ కృతీ శెట్టికి సైతం పలు ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి.. కృతీ శెట్టిని, అభినందిస్తూ ఓ లేఖ పంపించాడు. బ్లాక్‌బస్టర్‌ సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు లేఖతో పాటు ఓ ఖరీదైన బహుమతి అందించాడు. ఈ కానుకలు అందుకున్న ఈ ఇద్దరూ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు.

చిరంజీవి రాక్‌స్టార్‌కు పంపిన లేఖలో “డియర్‌ డీఎస్పీ, ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్‌ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావో, చిత్రరంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్‌కు అంతే ప్యాషన్‌తో సంగీతాన్నిస్తావు. నీలో ఉండే నీ ఎనర్జీ సినిమాలకు, మ్యూజిక్‌కు ఇచ్చే ఈ ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అని రాసుకొచ్చారు.

krithy

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!