చిరు 152 బోయపాటితో!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమా రంగంలో మళ్ళీ బిజీగా మారడానికి సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా తన కొడుకు రామ్ చరణ్ నిర్మించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తరువాత కూడా చిరు వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు చిరు మాటల్లో..

”150 వ సినిమా కోసం చాలా కథలు విన్నాను. ఫైనల్ గా కత్తి రీమేక్ చేసాను. అయితే ఆ కథల్లో నాకు నచ్చిన కథలు లైన్ లో ఉంచాను. పరుచూరి బ్రదర్స్ రాసిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి సినిమా చేయాలనుకుంటున్నాను. అలానే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా అనుకుంటున్నాం. బోయపాటి సినిమా 152 గా ప్లాన్ చేశాను. ఈలోగా గీతాఆర్ట్స్ లో ఓ సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతానికైతే సినిమాల మీద ఫోకస్ పెట్టాను. రెండు సినిమాల వరకు ఖచ్చితంగా చేస్తాను” అంటూ వెల్లడించారు.