బాలయ్య సినిమా పై స్పందించిన నిర్మాత

నందమూరి బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనతో పాటు తమిళ హీరోయిన్ వరలక్ష్మి కూడా నెగెటివ్ రోల్ చేస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన నిర్మాత సి.కళ్యాణ్ వరలక్ష్మి తమ సినిమాలో చేయట్లేదని, ఇప్పటి వరకు జగపతిబాబును మాత్రమే తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ నెలలోనే లాంచ్ కానున్న ఈ సినిమాకు ‘రూలర్’ అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఇకపోతే ఈ చిత్రంతో పాటే బోయపాటి శ్రీను డైరెక్షన్లో కూడా ఒక చిత్రం చేయనున్నారు బాలకృష్ణ.

CLICK HERE!! For the aha Latest Updates