
OTT Releases this week:
ఈ గురువారం (ఏప్రిల్ 24) ఓటీటీ ప్రేక్షకులకి పక్కా ఫుల్ ట్రీట్ దక్కబోతుంది. ఎందుకంటే రెండు భారీ సినిమాలు — L2: Empuraan మరియు Veera Dheera Sooran Part 2 — స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి.
Empuraan మోహన్‌లాల్ హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. మలయాళ సినీ చరిత్రలోనే ఇది ఇప్పటి వరకూ వచ్చిన అతిపెద్ద హిట్. దాదాపు రూ.260 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాకి సమీక్షలు మిక్స్‌డ్‌గానే వచ్చాయి. అయినా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ రిలీజ్ టైంలో కొంత వివాదం కూడా ఎదురైంది. అందుకే ఇప్పుడు హాట్‌స్టార్ లో వచ్చే దీన్ని చూసేందుకు అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంటుంది.
మరోవైపు విక్రమ్ నటించిన Veera Dheera Sooran: Part 2 కూడా అదే రోజు ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తమిళంలో మంచి రివ్యూలు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కానీ తెలుగులో ప్రమోషన్ బాగా లేకపోవడం, తప్పు టైంలో రిలీజ్ కావడంతో మిస్ అయ్యింది.
ఇప్పుడు ఓటీటీ ద్వారా తెలుగు ఆడియన్స్ దీనిని చూడొచ్చని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంటుంది.
ఈ రెండు సినిమాలు వేరే వేరే జానర్‌కి చెందినవే అయినా, దాదాపు ఒకేరోజున రానుండటంతో, ఓటీటీ ప్రియులకి రెండు మంచి ఎంటర్టైన్‌మెంట్స్ కచ్చితంగా దక్కబోతున్నాయి.
ALSO READ: సడన్ గా Allu Arjun ముంబై ఎందుకు వెళ్లారంటే