నయనతార ఏమైనా సూపర్ స్టారా..?

తెలుగు, తమిళ బాషల్లో నయన్ కు ఉన్న క్రేజే వేరు. తమిళంలో స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ఆమె పేరే మొదట వస్తుంది. ఎంత స్టార్ హీరోయిన్ అయినా.. సినిమా పబ్లిసిటీ అయితే చేయాలి కదా..? ‘డోర’ అనే సినిమాలో నటించినందుకు నయన్ రెండున్నర కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంది. కానీ ఆ సినిమా ప్రమోషన్స్ కు రాలేదు. ప్రమోషన్స్ కు రాననే కండీషన్ ముందే పెట్టేస్తుంది.

కనీసం ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమాలకు కూడా పబ్లిసిటీ చేయకపోతే ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు. తెలుగులో అయితే ఆమె సినిమా రిలీజ్ అవుతోందని బుక్ మై షో లాంటి వెబ్ సైట్లు ఓపెన్ చేస్తేనే గానీ తెలియడం లేదు. గతంలో బాబు బంగారం సినిమాకు కూడా ప్రమోషన్స్ ఎగ్గొట్టిన నయన్ డోర విషయంలో కూడా అదే రిపీట్ చేసింది. సినిమా చేసేసి పబ్లిసిటీకి రాకపోయినా చెళ్ళడానికి నయన్ ఏమైనా సూపర్ స్టార్ రజినీకాంతా.. లేక పవన్ కళ్యాణా..? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కనీసం ఇకనైనా నయన్ తన పంతం వీడి నిర్మాతలకు సపోర్టివ్ గా ఉంటే
బావుంటుంది.