వర్మపై హెచ్చార్సీకు ఫిర్యాదు!

బయోపిక్ సినిమాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మ కు సెపరేట్ స్టయిల్ ఉంది. రీసెంట్ గా విజయవాడలో జరిగిన గొడవల నేపధ్యంలో ‘వంగవీటి’ పేరుతో సినిమాను రూపొందించారు. ఈ సినిమా విడుదలకు ముందు నుండి వివాదాస్పదం అయింది. ఇక విడుదలయిన తరువాత
చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కానీ వంగవీటి అభిమాన సంఘాలకు మాత్రం సినిమా నచ్చలేదట. దీనిపై వారు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినాటు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ కుల వర్గాన్ని రౌడీలుగా చూపించారని, అది తమ మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.
వెంటనే ఆ సన్నివేశాలను సినిమా నుండి తొలగించాలని వారు కోరారు. లేదంటే సినిమా ప్రదర్శనను ఆడుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వారు ఇచ్చిన కంప్లైంట్ పై స్పందించిన మానవహక్కుల కమీషన్ జనవరి 16లోగా పూర్తి వివరాలను నివేదికగా అందించాలని సెన్సార్ బోర్డుకి ఆదేశాలు జారీ చేసింది.