HomeTelugu Big Storiesభారత్‌లో కొనసాగుతున్న కరోనా హవా

భారత్‌లో కొనసాగుతున్న కరోనా హవా

10 24
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో భారత్‌లో 1975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 26,917 మంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 826కి చేరింది. ఇప్పటివరకు 5,914 మంది ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. ఇవాళ మహారాష్ట్రలో అత్యధికంగా 22 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో అత్యధికంగా 7,628 మంది కరోనా బాధితులు ఉండగా 323 మంది మృతిచెందారు. వెయ్యికి పైగా కరోనా కేసులున్న రాష్ట్రాలు గుజరాత్ 3,071, ఢిల్లీ 2,625, రాజస్థాన్ 2,083, మధ్యప్రదేశ్ 2,096, యూపీ 1,843, తమిళనాడు 1,821, ఆంధ్రప్రదేశ్‌లో 1,097 కరోనా బాధితులున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 1097కి చేరింది. ఇవాళ ఒక్కరోజే కృష్ణా జిల్లాలో 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల
వివరాలు చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 279, గుంటూరు 214, కృష్ణా 177, చిత్తూరు 73, నెల్లూరు 72, కడప 58, ప్రకాశం 56, అనంతపురం 53, ప.గో 51, తూ.గో 39, విశాఖ 22, శ్రీకాకుళం 3 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 231 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్చి కాగా ఇంకా 835 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

నిన్నటి వరకు అందిన వివరాల ప్రకారం తెలంగాణలో 990 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu