HomeTelugu Big Storiesభారత్‌లో ఆగని కరోనా కేసులు

భారత్‌లో ఆగని కరోనా కేసులు

9 22
భారత్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉధృతమౌతూనే ఉంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,452కి చేరింది. వీరిలో 4,814 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 723 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 491 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 28 రోజులుగా 15 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, 14 రోజులుగా 80 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదని తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 6,430 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 283 మంది కరోనాతో మృతిచెందారు. 2,624 పాజిటివ్ కేసులతో దేశంలో రెండో స్థానంలో గుజరాత్ ఉంది. ఇక్కడ 112 మంది కరోనా మహమ్మారి బలి తీసుకుంది.

తెలంగాణలో ఇవాళ కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సాయంత్రం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో కేసుల సంఖ్య 983కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 291 మంది డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రిలో మరో 663 మంది చికిత్సపొందుతున్నారు. మరో ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలిపారు. గత 24 గంటల్లో 500కి పైగా పరీక్షలు చేసినట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో ముఖ్యంగా 4 ప్రాంతాల నుంచి ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నట్టు తెలిపారు. వికారాబాద్, గద్వాల, సూర్యాపేట, జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి, గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి, వికారాబాద్‌లో 14 కుటుంబాల నుంచి కేసులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 44 కుటుంబాల నుంచి 260 మందికి కరోనా సోకినట్టు మంత్రి ఈటల వెల్లడించారు.

ఏపీలోనూ కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 955కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో కర్నూలులో 27 కేసులు కొత్తగా బయటపడ్డాయి. దీంతో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 261 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, గుంటూరు 206, కృష్ణా 102, చిత్తూరు 73, నెల్లూరు 68, ప్రకాశం 53, కడప 51, అనంతపురం 46, ప.గో 39, తూ.గో. 34, విశాఖలో 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనా నుంచి 145 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu