బన్నీ, త్రివిక్రమ్‌ సినిమా నుండి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఔట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది బన్నీకి 19వ సినిమా కాగా.. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రం. ఈ సినిమా నుంచి కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని తప్పించారనే వార్తలు వచ్చాయి. వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పృథ్వీ.. ప్రత్యర్థి పార్టీలపై కాస్త ఘాటుగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్‌పై కూడా విమర్శలు గుప్పించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంతో తన సినిమా నుంచి పృథ్వీని బన్నీ తప్పించారని, దీనికి త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పారని వార్తలు వినిపించాయి… దాని కారణంగానే ఈ సినిమా నుంచి పృద్విని పక్కన పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. పృద్వి పాత్రను మరొకరికి ఆఫర్ చేసినట్టుగా సమాచారం.