చంద్రబాబు నివాసానికి నోటిసులు జారీ

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌కు కూడా కరకట్ట వెంబడి అక్రమ నిర్మాణాలకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సులో అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో.. ప్రజావేదిక నుంచి ప్రారంభమైన కూల్చివేతల కార్యక్రమం… నిబంధనలకు విరుద్ధంగా కరకట్టలపై నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. అందులో భాగంగా మరో 20 అక్రమ కట్టడాలకు సంబంధించిన యజమానులకు నోటీసులు ఇచ్చారు. లింగమేని గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ నరేంద్ర… అక్కడ నోటీసులు అంటించారు. గత నాలుగేళ్లుగా లింగమనేని గెస్ట్ హౌస్‌లో నివాసం ఉంటున్న చంద్రబాబు… తన అధికారిక కార్యక్రమాలను ఇక్కడే నుంచే నిర్వహిస్తున్నారు.

‘ఎలాంటి నిర్మాణ అనుమతులు పొందకుండా భవనాన్ని నిర్మించారని… నిబంధనలకు విరుద్ధంగా ఎకరం 6 సెంట్లలో అక్రమంగా భవనాన్ని నిర్మించారని’ నోటీసుల్లో పేర్కొన్నారు సీఆర్డీఏ అధికారులు. భవన నిర్మాణం, స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ నిర్మాణాలు.. కృష్ణానదికి 100 మీటర్ల లోపే నిర్మించారు. ఎలాంటి అనుమతులు పొందకుండా 10 తాత్కాలిక షెడ్లను కూడా నిర్మించారని’ నోటీసుల్లో పేర్కొన్న అధికారులు.. ఏడు రోజుల్లోగా స్వచ్ఛందంగా ఈ నిర్మాణాలను కూల్చివేయాలని లింగమనేని ఎస్టేట్‌కు సంబంధించిన యజమానులే వీటికి బాధ్యత వహించాలని.. లేకపోతే ఎందుకు కూల్చివేయరాదో సంజాయిషీ ఇవ్వాలి..! సంజాయితీ సంతృప్తి కరంగా లేని ఎడల తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే.. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే కూల్చివేయడానికి పూనుకునే అవకాశం ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates