HomeTelugu Trendingషూటింగ్ సెట్ లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన Dasara నటుడు

షూటింగ్ సెట్ లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన Dasara నటుడు

Dasara actor Caught Using Drugs on Set
Dasara actor Caught Using Drugs on Set

Dasara actor in Drug Scandal:

మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాలెంటెడ్ యాక్టర్ షైన్ టామ్ చక్కో, ‘దసరా’, ‘దేవర’, ‘రంగబలి’, ‘డాకూ మహారాజ్’ లాంటి తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు పొందాడు. తెలుగులోనూ బిజీగా ఉన్న ఆయనకి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చింది.

తాజాగా ‘సూత్రవాక్యం’ అనే సినిమాలో నటిస్తున్న షైన్ టామ్ చక్కోపై సినిమా షూటింగ్ సమయంలో డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌లో నటించిన మలయాళ నటి విన్సీ ఆలోషియస్ ఫిల్మ్ చాంబర్‌తో పాటు ప్రొడక్షన్ హౌస్‌కి ఫిర్యాదు చేశారు. ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ కండ్రగుల.

ఒకవేళ డ్రగ్స్ వాడటం నిజమే అయితే, ఇది చిన్న విషయం కాదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం, షూటింగ్ జరుగుతున్న హోటల్‌కి కొచ్చిలో పోలీసులు వచ్చి సడెన్‌గా రైడ్ చేశారు. అప్పటికే షైన్ అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇదేగాక, షైన్ టామ్ చక్కోకు డ్రగ్స్‌తో సంబంధం కొత్తకాదు. 2015లో ఆయన కోకైన్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అప్పట్లో అది పెద్ద న్యూస్ అయింది. కానీ తర్వాత ఆయన తిరిగి సినిమాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు మళ్లీ అదే రకం ఆరోపణలు రావడం అభిమానుల్లో ఆందోళన రేపుతోంది.

ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి. డ్రగ్స్ వాడకాన్ని టాలెంటుతో మిక్స్ చేయలేరు అనే వాదనలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నటనలో టాలెంట్ ఉన్నా, ప్రొఫెషనల్ బిహేవియర్ లేకపోతే అవకాశాలు దూరం అవుతాయని చెప్పకనే చెప్పిన పరిస్థితి ఇది.

ALSO READ: Odela 2 Review: తమ్మన్నా సినిమా ఎంతవరకు వర్కౌట్ అయింది?

Recent Articles English

Gallery

Recent Articles Telugu