‘అమ్మ’ కథతో దాసరి..?

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.  డైరెక్షన్ వైపు కొంత గ్యాప్ తీసుకున్న దాసరి త్వరలోనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. కథా బలాన్ని మాత్రమే నమ్ముకొని సినిమాలు తీసి దర్శకుడిగా సక్సెస్ అయిన దాసరి ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ బాధ్యతలు నిర్వహించడానికి రెడీ అయిపోతున్నారు. ‘అమ్మ’ పేరిట ఆయన ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు తమిళ, హిందీ బాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. ఇటీవల మరణించిన తమిళనాడు మంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబోతున్నట్లు టాక్. ఆమె మరణించిన తరువాత ఆమె కథను సినిమాగా చేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. ఫైనల్ గా దాసరి ఈ బాధ్యతలు చేపట్టడం విశేషమనే చెప్పాలి.