దీప్తి సునయన ‘రౌడీ బేబీ’ సాంగ్‌ ..వైరల్‌!

బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన యూట్యూబ్‌లో రౌడీ బేబీగా రచ్చ చేస్తుంది. డబ్ స్మాష్ వీడియోలతో పాటు ‘రంగమ్మా.. మంగమ్మా’, ‘గువ్వా.. గోరింకతో’ లాంటి రీమేక్ సాంగ్స్‌తో యూట్యూబ్ సంచలనంగా మారి బిగ్ బాస్‌ రియాలిటీ షోలో ఛాన్స్ దక్కించుకున్న సునయన స్మాల్ గ్యాప్ తరువాత రచ్చను షురూ చేసింది.

తమిళ్‌లో ధనుష్, సాయి పల్లవి నటించిన ‘మారి 2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ అదరగొట్టేసింది. ‘మారి 2’ లోని రౌడీ బేబీ పాటలో 156.3 మిలియన్ల వ్యూస్‌తో సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన సాంగ్స్‌లో ఒకటిగా యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. ఈ పాటను ధనుష్, ఎం.ఎం.మానసి ఆలపించారు. సామ్రాట్ సాహిత్యం అందించగా యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.

ఈ సాంగ్‌కి క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ సునయన ‘రౌడీ బేబీ’ అవతారం ఎత్తింది. తన కో ఆర్టిస్ట్ మహబూబ్ దిల్‌సేతో కలిసి దుమ్ములేపే స్టెప్పుల్ని వేసింది. వినయ్ షణ్ముక్.. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సాంగ్‌కి హైలైట్ అయ్యాయి. ఇటీవల విడుదలై ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 3.5 మిలియన్లకు చేరువైంది సునయన రౌడీ బేబీ సాంగ్.

‘దీప్తి సునయన సాంగ్స్‌లో ఇదే బెస్ట్.. డాన్స్ చాలా బాగా చేసింది. సునయన చాలా క్యూట్‌గా ఉంది. సునయన ఓవర్ యాక్టింగ్‌కి పోకుండా చాలా కష్టపడి చేసినట్టు ఉంది. తొలిసారి సునయన సాంగ్‌ని పూర్తిగా చూశా’ అంటూ ఈ పాటపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రౌడీ బేబి రచ్చపై మీరూ ఓ లుక్కేయండి.