ఛోటా మేస్త్రీ టైటిల్ మాత్రమే ఉందట!

సంపత్ నంది.. మాస్ సినిమాలను బాగా చేయగలడనే పేరు తెచ్చుకున్నాడు. రచ్చ సినిమా సమయంలోనే ‘ఛోటా మేస్త్రీ’ అనే టైటిల్ వినిపించింది. రామ్ చరణ్ తో రచ్చ సినిమా తరువాత సంపత్ మళ్ళీ కలిసి పని చేస్తారని ఆ సినిమానే ఛోటా మేస్త్రీ అనే ప్రచారం జరిగింది. చిరంజీవి నటించిన ‘ముఠా మేస్త్రీ’ సినిమాకు ఇది సీక్వెల్ అని అన్నారు. సంపత్ నంది ప్రస్తావన ఎప్పుడు వచ్చినా.. సరే ఛోటామేస్త్రీ టాపిక్ నడిచేది. అయితే అసలు ‘ఛోటామేస్త్రీ’ కథే లేదని సంపత్ అందరికీ షాక్ ఇచ్చాడు. టైటిల్
ఒక్కటే ఉందట. దాని చుట్టూ ఇప్పుడు కథ అల్లుకోవాలని సంపత్ నంది చెప్పుకొచ్చాడు.

నిజానికి సంపత్ దగ్గర సిద్ధంగా ఏ కథలు ఉండవట. అప్పటికప్పుడు కథలు అల్లుకోవడమే తనకు ఇష్టమని వెల్లడించారు. కథలు రాసుకొని వాటిని దాచుకోవడం తనకు ఇష్టం ఉండదట. అప్పటికప్పుడు వచ్చిన ఐడియాను ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు తగ్గట్లుగా రాసుకోవడమే తనకు నచ్చుతుందని అన్నారు. అందుకే దర్శకుడిగా ఆయన సినిమాలు చేయడానికి చాలా సమయం పడుతుంది. డైరెక్టర్ ఆయన జోరు పెంచాలంటే కథల విషయంలో ఫాస్ట్ గా ఉంటేనే మంచిది.