‘దేవదాస్’ ట్రైలర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరో కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా ‘దేవదాస్’‌. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్‌, రష్మికా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకుని.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకొంటోంది. గురువారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ఈ మూవీ ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

‘అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా..’ అనే పాటతో ప్రారంభమైన ట్రైలర్‌లో ఆ తర్వాత వచ్చే సన్నివేశాలను చూస్తే సినిమాను ఫుల్‌లెంగ్త్‌ ‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతుంది. నాగార్జున, నాని మధ్య వచ్చిన సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. నాగ్‌ ఇందులో డాన్‌ పాత్రలో కనిపిస్తుండగా నాని డాక్టర్‌ పాత్ర పోషిస్తున్నాడు. నాని నిర్వహించే ఆసుపత్రిలోకి నాగార్జున వచ్చి చేసే హంగామా ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తుంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.