
కోలీవుడ్ హీరో ధనుష్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సినిమాకు ధనుష్ సైన్ చేసిన సంగతి తెలిసిందే. త్రిభాష చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను స్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.
పొలిటికల్ టచ్‌తో సినిమా ఉండనుందని తెలుస్తోంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక శేఖర్ కమ్ముల సినిమా లైన్‌లో ఉండగానే ధనుష్ మరో తెలుగు సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఓ యంగ్ డైరెక్టర్‌కు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఓ బడా నిర్మాణ సంస్థ ఈ మూవీని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.













