‘జై లవకుశ’ ఫస్ట్ డే కలెక్షన్స్!

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘జై లవకుశ’ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి తన సత్తాను చాటాడు. మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజున భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఈ సినిమా మొదటిరోజు నైజాంలో 5.05 కోట్ల షేర్ ను రాబట్టింది. సీడెడ్ లో 3.77 కోట్లు వసూలు చేసింది. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఈ సినిమా మొదటిరోజు పాతిక కోట్ల వరకు వసూలు చేసిందని అంచనా. మొదటి రోజు కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఉంటే వారం రోజుల్లో ఖచ్చితంగా సినిమా 100 కోట్లు దాటేస్తుందని భావిస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా మొదటి రోజు 3.64 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు.

నిజానికి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ కాకుండా 26 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ప్రీరిలీజ్ బిజినెస్ 80 కోట్లకు పైగా జరిగింది. ఎన్టీఆర్ నటించిన గత చిత్రం ‘జనతా గ్యారేజ్’ లాంగ్ రన్ లో మొత్తం 136 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు ‘జై లవకుశ’ ఆ ఫీట్ ను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.