దిల్ రాజు దాగుడుమూతలు!

ప్రతిభ ఉన్న దర్శకులను గుర్తించడం వారితో సినిమా చేయడం దిల్ రాజుకి అలవాటు. అయితే ఒకవేళ వారితో చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే దిల్ రాజు మాత్రం వారిని పక్కన పెట్టరు. పెంచి పోషిస్తూనే ఉంటారు. అందుకే ఆయన కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన దర్శకులంతా కూడా అక్కడ పాతుకుపోతుంటారు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా దిల్ రాజు కాంపౌండ్ లో సెటిల్ అయిపోయాడు. ఎన్టీఆర్ తో హరీష్ శంకర్ చేసిన ‘రామయ్యా వస్తావయ్య’ సినిమా నష్టాలను మిగిల్చింది. 
అయినా.. సరే దిల్ రాజు పిలిచి మరీ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా ఓ మోస్తరు హిట్టే.. రీసెంట్ గా అల్లు అర్జున్ తో కలిసి దిల్ రాజు బ్యానర్ లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను తెరకెక్కించారు హరీష్ శంకర్. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. వసూళ్ల పరంగా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక్కడితో దిల్ రాజు.. హరీష్ శంకర్ ను వదిలేయలేదు. ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వరుసగా నాలుగో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు హరీష్ శంకర్. ఈ సినిమాకు ‘దాగుడుమూతలు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. మరి ఈసారి దిల్ రాజు ఎలాంటి సినిమా చేస్తాడో.. చూడాలి!